పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / బేతాళ ప్రశ్నలు్

 

’రాత్రి చనిపోయింది బాలుడు కాదు’ అన్నాడొక వ్యక్తి "వృద్ధుడు గానీ వృద్దురాలు గానీ అయి ఉంటుంది" అన్నాడు రెండో మనిషి "కాదు నిశ్చయంగా వృద్ధుడే" అన్నాడు మూడో వ్యక్తి.


’పనిచేసే కొద్దీ మరింత అభివృద్ధి చెందే అవయవం మెదడొక్కటే’ అన్నాడు ఐన్ స్టీన్. పాలిష్ చేసిన బూట్లు ఎందుకు మెరుస్తాయి? రెండు + రెండు/ రెండు ఎంత? ఎడిసన్ తయారు చేసిన మొదటి బల్బు ఇప్పుడెక్కడ వుంది? కోళ్ళు గొర్రెలకు రెట్టింపు వాటి తలల మొత్తం 99. ఎన్నెన్ని?

 

పిల్లల్లో లెక్కలు, విజ్ఞాన శాస్త్రం పట్ల భయాన్ని తగ్గించి ఉత్సాహాన్ని పెంచే పుస్తకం ఇది. ఛార్టెర్డ్ అకౌంటెంట్ గా, ఎన్నో ఇంటార్వ్యూ బోర్డుల్లో మెంబర్ గా ఉన్న అనుభవంతో, ఏ ప్రశ్నలకి ఎలా సమాధానాలు చెప్పి ఉద్యోగం సంపాందించాలో వివరిస్తూ, యువకుల్లో లేటరల్ థింకింగ్ ని పెంచడానికి చక్కటి లెక్కల రూపంలో యండమూరి వీరేంధ్రనాథ్ తయారు చేసిన అంతరంగ వికాస పుస్తకం ఈ బేతాళ ప్రశ్నలు.

సాయంత్రం పూట కుటుంబమంతా సరదాగా కలసి కూర్చుని ఆడుకోవడానికి ఎన్నో ఇంటలిజెంట్ + ఫన్నీ పజిల్స్ లో మెదడుకి వ్యాయామం నేర్పే ఇటువంటి పుస్తకం ఇంతవరకూ తెలుగులో రాలేదని చెప్పటానికి ఏ సందేహమూ లేదు.

 
to purchase book