పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / మీరు మంచి అమ్మాయి కాదు

 

తొంభై ఏళ్ల కమలమ్మ మరణానికి మూడు క్షణాల రూపంలో ఉంది.
చిన్నత నం నుంచి కమల తల్లిదండ్రుల మాటను ఎప్పుడూ జవదాటలేదు.
పెద్దయ ్యాక వాళ్లు చూపించిన సంబంధం చేసుకుంది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లి ఆడపడుచులకు, మరుదులకు అడుగులొత్తింది. భర్త బలహీనతలను క్షమించింది. సవతికి తాను అన్నం వండి పెట్టింది.
భర్త మరణించాక గుళ్లకూ, హరికథలకూ జీవితాన్ని అంకితం చేసుకుంది.

ఇప్పుడు మరణానికి చాలా చేరువలో ఉంది. వెనక్కు తిరిగి చూసుకుంటే తను ఏం సాధించిందో ఆమెకు అర్థం కాలేదు. "కమలమ్మ చాలా మంచిది" అన్న పేరుని మాత్రం సంపాందించుకుంది. ’ఈ ఒక్క మాట కోసమా తనిన్నాళ్లూ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుని బ్రతికింది? అని తనను తాను ప్రశ్నించుకుంది కమలమ్మ. మరణానికి చేరువలో, తొంభై ఏళ్ల వయసులో ఆమెకి జ్ఞానదంతం వచ్చింది. "మంచి" అంటే ఏమిటో వీరేంధ్రనాథ్ తనదైన శైలిలో వివరించే పుస్తకం ఇది.

 
to purchase book