పబ్లికేషన్స్ / ఫిక్షన్. / అతడు ఆమె ప్రియుడు

 

భార్యని నిర్దాక్షిణంగా హత్య చేసిన హంతకుడు అతడు.

....ఉరిశిక్షకి ముందు రోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతుకుడు తన ఇంట్లో ఉన్నాడని తెలిసి కంగారుపడింది.

ఇన్ని సంవత్సరాలుగా తనని అతడు అజ్ఞానంగా ప్రేమిస్తున్నాడని, తనని చివరి సారి చూడాలని అతడు వచ్చాడని తెలిసి కలవరపడింది. అతడి ప్రేమని చూసి కదిలిపోయింది. కానీ ఆ రాత్రి అతడు తన భర్త మీద హత్యాప్రయత్నం చేశాడని తెలిసింది. ఎందుకు..?

 

ఆమె ఆరా తీయడం ప్రారంభించింది. గని త్రవ్వకాల్లో శిథిలాలు బయటపడ్డట్టూ ఒక్కోక్క నిజమూ బయటపడసాగింది. భయంకరమైన నిజాలూ, మనుష్యుల జీవితాల వెనుక చీకటి రహస్యాలూ తెలిసాయి. ప్రమాదం ఆమెని వెంటాడసాగింది!...యండమూరి....ది యునీక్ మాస్టర్ స్టోరీ టెల్లర్...

 
to purchase book