విశేషాంశాలు..

  • 1980 లో ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో సీరియల్ గా వెలువడిన ’తులసీదళం’ తెలుగు సాహిత్యాన్నే ఒక కుదుపు కుదిపింది. ఆధునిక నవలా సాహిత్యంలో ఒక కొత్త ఒరవడికి యండమూరి వీరేంధ్రనాథ్ ఆవిధంగా నాంది పలికారు.
  • ’వెన్నెల్లో ఆడపిల్ల’ నవల ముప్పైసార్లకు పైగా ముద్రణలకి నోచుకుంది. అలాగే పాతికేళ్ళలో వెలువరించిన కథల్లో అత్యున్నతమైన  వాటిని ఏరి కూర్చిన ’ది బెస్ట్ ఆఫ్’ యండమూరి కూడా ఎన్నోసార్లు పునర్ముద్రితం అయ్యింది.
  • ’తులసీ దళం’, ’తులసి’,’పర్ణశాల’,’ప్రార్థన’,’ఆనందో బ్రహ్మ’, ’ప్రియురాలు పిలిచె’, మొదలైన నవలలు ఆంధ్రభూమి సచిత్రవారపత్రిక లో సీరియల్స్ గా వచ్చి ప్రజాదరణ పొందాయి. నవలలుగా కూడా అవి ఘన విజాయాన్ని సాధించాయి.
  • సబ్జెక్ట్ రీసెర్చ్ ని, ఇన్వెస్టీగేషన్ జర్నలిజాన్ని తెలుగు నవలల్లో మొదటిసారిగా పరిచయం చేసింది యండమూరి. అలాగే పూర్తి సైంటిఫిక్ నవల తొలిసారిగా తెలుగులో వ్రాసింది యండమూరి. దానిపేరు ’చీకట్లో సూర్యుడు’.
  • రాసిన సబ్జెక్ట్ మళ్ళీ రాయకుండా ఒక్కో నవలకీ ఒక్కో సబ్జెక్టుని ఎన్నుకుని స్టడీ చేసి రాసిన రచయిత యండమూరి.
  • వీరు రాసిన ’మనుషలొస్తున్నారు జాగ్రత్త’,’రుద్రవీణ’ నాటికలు 1000 కు పైగా ప్రదర్శనలకి నోచుకున్నాయి.
  • 1984లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన పాపులారిటీ కాంటెస్ట్ లో ఎన్నికైన నలుగురిలో యండమూరి ఒకరు. మిగతావారు ఎన్.టి.ఆర్. జనరల్ క్రిష్ణారావు మరియు బాపుగార్లు.
  • ఒక వారపత్రిక ముఖచిత్రంగా రచయితల్ని పరిచయం చేయడం యండమూరి తోనే మొదలయ్యింది.
  • ’విజయానికి అయిదు మెట్లు’ లక్ష కాపీలకి పైగా అమ్ముడు  పోయి అమ్మకాలలో రికార్టు సృష్టించింది.