టి.వి. రంగం...యండమూరి బుల్లితెరకు కథ రచయితగా, దర్శకుడిగా పనిచేసారు. జెమిని టి.వి.లో వచ్చిన ’ఆనందో బ్రహ్మ’,’తులసీ దళం’ సీరియల్స్ ఎంతో ప్రజాదరణ పొందాయి. ’భార్య గుణవతి శత్రు’ సీరియల్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ లభించింది.
’వెన్నెల్లో ఆడపిల్ల’ దూరదర్శన్ లో ప్రసారమవుతున్న సమయంలో నెం.1 సీరియల్ గా రేటింగ్ లభించింది.
ఇదే సీరియల్ కి యండమూరి ఉత్తమ దర్శకుడిగా బహుమతి అందుకున్నారు.
దానికి తృతీయ ఉత్తమ సీరియల్ అవార్డు కూడా లభించింది.
అలాగే ’విజయం వైపు పయనం’ సీరియల్ కి బెస్ట్ సోషల్లీ రిలవెంట్ ఫిల్మ్ దర్శకుడిగా యండమూరి నంది అవార్డుని గెలుచుకున్నారు.
దానికి బంగారు నంది కూడా లభించింది.