మీడియా ప్రశంసలు..

Andhra Jyothi (maa vooru) 4th August, 2013

ఆయన ’ఋషి’ లా యజ్ఞం చేసి ఓ ’పర్ణశాల’ ను నిర్మించారు.పాఠకలోకం పట్టించుకోలేదు.’నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’ అన్నట్లుగా మౌన గంభీరంగా ఉన్న పరిస్థితిని ఒక్క ’తులసిదళం’ తో బద్దలుకొట్టారు. నవలారచనలో రచయిత్రుల అధిపత్యానికి తెరదించి, ’ఓన్లీ రైటర్’ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన....యండమూరి వీరేంధ్రనాథ్. విమర్శకులు క్షుద్ర రచయిత అని వెక్కిరించినా ’వెన్నెల్లో ఆడపిల్ల’, ’ఆనందో బ్రహ్మ’లలో మనుషుల్లోని సున్నితత్వాన్ని అందంగా ఆకర్షీకరించారు. ఏకబిగిన చదివించే శైలితో గోదారి గలగలలు వినిపించారు.నాటక రచయితగా రంగ ప్రవేశం చేసి సినిమా రచయితగా తనేమిటో నిరూపించుకున్నారు. దశాబ్దం తరువాత ’విజయానికి అయిదు మెట్లు’ నిర్మించి, ఎంతో మంది వ్యక్తిత్వ వికాసానికి బాటలు పరిచారు. రేపటి పౌరుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు ప్రస్తుతం సరస్వతీ పీఠాన్ని నిర్మిస్తున్నారు యండమూరి.
- ఈనాడు ఆదివారం 6మార్చి 2005 (పుస్తకం)


తులసిదళంలో తెలుగు నాట సంచలనం సృష్టించిన రచయిత యండమూరి వీరేంధ్రనాథ్. క్షుద్ర రచయితగా విమర్శకులు చేసిన వారికి ’ఆనందో బ్రహ్మ’, ’అంతర్ముఖం’ తో సమాధానం చెప్పిన గడుసువాడు. పాపులర్ రచయితేగా అని పెదవి విరిచిన వారికి ’విజయానికి అయిదు మెట్లు’ చూపించాడు. నవలలకు మార్కెట్ లేక వ్యక్తిత్వ వికాసం అంటున్నాడనే విమర్శకులకు ’విజయానికి ఆరో మెట్టు’తో గీతాభ్యాసం వినిపించాడు. చివరిగా విద్యార్థుల కోసం ’సరస్వతీ విద్యా పీఠం’ స్థాపిస్తున్నాడు. ఒత్తిళ్ళు లేని విద్యను, వ్యక్తిత్వ వికాస సూత్రాలను వారికి అందించేందుకు కొత్త యజ్ఞానికి సన్నద్ధమవుతున్నాడు. - ఆంధ్రజ్యోతి (యంగ్) ఆదివారం 10, ఏప్రిల్ 2005


As a fiction writer, Yandamoori held sway among Telugu readers with his off-beat novels. He has successfully shifted his genre to personality development and is now enacting the role of an agony uncle on television - THE HINDU,Sunday, March, 16th 2003


ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంధ్రనాథ్. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక గ్రంథాలను రచించారు. ఆయన రాసిన గ్రంథాలు అక్షరాలా ’హాట్ కేక్స్’ లా అమ్ముడుపోయాయి. ఆయన రాసిన ’విజయానికి అయిదు మెట్లు’,’విజయానికి ఆరో మెట్టు’ తదితర గ్రంథాలు వ్యక్తిత్వ వికాస నిపుణులకు పాఠ్య గ్రంథాలయ్యాయి. ప్రస్తుతం ఆయన వివిధ సంస్థలు, విద్యాలయల్లో, వ్యక్తిత్వ వికాస శిక్షకుడు కావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. - ఇండియా టుడే 9, ఆగష్టు 2005


మీ పిల్లలు నెంబరు 1 కావలనుకుంటున్నారా? అనే అంశంపై ’ఈనాడు’ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి విజయనగరం ఆనందగణపతిరాజు ఆడిటోరియంలో నిర్వహించిన చైతన్య వేదికకు అపూర్వ స్పనందన లభించింది. ప్రముఖ నవలా, మనో వైజ్ఞాని గ్రంధాల రచయితల యండమూరి వీరేంధ్రనాథ్ అద్యంతం రక్తికట్టించారు. ప్రశ్నలు, సమాధానాలు...జోకులు, ఛలోక్తులు...జాగ్రత్తలతో సాగిన ఆయన ప్రసంగం అహూతులను ఆకట్టుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 1500 మందికి పైగా కార్యక్రమానికి హాజరయ్యారు.- ఈనాడు, శుక్రవారం 25, మార్చి 2005