సినీ రంగం:యండమూరి రచనల్లో చాలా రచనలు చలన చిత్రాలుగా రూపొందాయి. వీరు సినిమాలకు కథ అందించడమే కాక, సంభాషణలు, స్క్రీన్ ప్లే లు కూడా సమకూర్చారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు. 1979 లోనే మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ’ఒక ఊరి కథ’ కు మాటలు వ్రాసారు. ఆ చిత్రం రాష్ట్రపతి పతకం గెలుచుకుంది. ’మంచుపల్లకి’, ’ఆడది గడపదాటితే’, చిత్రాలకు కూడా మాటలు వ్రాసారు. వీరు వ్రాసిన ’కుక్క’ అనే నాటకం చలన చిత్రంగా రూపుదిద్దుకున్నది.

వీరి నవలల్లో ’అభిలాష’, ’డబ్బు డబ్బు’ (ఛాలెంజ్), ’రక్తసింధూరం’, ’ఒక రాధ ఇద్దరు కృష్ణులు’, ’నల్లంచు తెల్లచీర’(దొంగ మొగుడు), ’తులసీ దళం’, ’తులసీ’(కాస్మోరా), ’రాక్షసుడు’, ’ఆఖరి పోరాటం’, ’రక్తాభిషేకం’, ’మరణ మృదంగం’, ’రుద్రనేత్ర’,’థ్రిల్లర్’ (ముత్యమంత ముద్దు), ’అగ్ని ప్రవేశం’, ’స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ మొదలైనవి చలన చిత్రాలుగా వచ్చాయి.

కేవలం సినిమా కోసమే `విక్కీదాదా’ అన్న రచన చేసారు. వీరి నవల ’వెన్నెల్లో ఆడపిల్ల’ కన్నడ భాషలో ’బెళదింగళ బాలె’ అన్న పేరుతో సినిమాగా వచ్చింది. ఘన విజయాన్ని సాధించింది. ’జగదేకవీరుడు - అతిలోక సుందరి’ సినిమాకు స్క్రీన్ ప్లే సమాకుర్చారు.

వీరికి సెంటిమెంట్ విషయంలో కోదండ రామిరెడ్డి, విజులైజేషన్, టేకింగ్ విషయాల్లో రాఘవేంద్రరావు, ఫ్రేమింగ్, స్ర్కీన్ ప్లే విషయాల్లో రవిరాజా పినిశెట్టి పద్ధతులు ఇష్టం. ’అగ్నిప్రవేశం’,స్టువర్టుపురం పోలిస్ స్టేషన్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు యండమూరి.చిరంజీవి యండమూరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. సినిమాలుగా రూపుదిద్దుకున్న ఎనిమిది యండమూరి నవలలకి చిరంజీవి హీరోగా నటించారు. అవి అభిలాష్,ఛాలెంజ్, రాక్షసుడు, రక్త సింధూరం, మరణ మృందంగం, రుద్రనేత్ర, దొంగమొగుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్. యండమూరి, చిరంజీవి మంచి మిత్రులు.

 

యండమూరి సినిమా స్టిల్స్

Click here for Working Stills


Click here for Working Stills

Yandamoori